Utsavam: ఓటీటీలోకి థియేటర్స్‌లో మెప్పించిన చిత్రం.. నాటకాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తప్పకుండా వీక్షించండి..!

by Anjali |
Utsavam: ఓటీటీలోకి థియేటర్స్‌లో మెప్పించిన చిత్రం.. నాటకాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు తప్పకుండా వీక్షించండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చిన్న సినిమాలుగా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంటోన్న విషయం తెలిసిందే. కంటెంట్ బాగుంటే మూవీ చిన్నదా ? పెద్దదా? అని జనాలు ఆలోచించట్లేదు. కథ బాగుంటే థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. సినిమా కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇదే తరహాలో తెరకెక్కిన సెప్టెంబరు 13 వ తారీకున థియేటర్స్‌లో కి వచ్చిన ఉత్సవం చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు హార్న్ బిల్ బ్యానర్ సురేష్ నిర్మాతగా వ్యవహరించగా.. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు.

ఉత్సవంలో దిలీప్ ప్రకాష్ అండ్ రెజీనా కసాండ్రా హీరో హీరోయిన్‌గా నటించారు. అలాగే బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, అలీ, ఆమని, మధుబాల వంటి ప్రముఖ నటులు ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలతో జనాల్ని కట్టిపడేసింది. కాగా దసరా పండుగ సందర్భంగా బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అక్టోబర్ 11 న వచ్చింది. నాటక రంగంపై ఆసక్తి ఉన్నవారు ఈ మూవీ చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed