నీళ్లను కార్లు కడగడం, తోటపనికి వాడితే రూ.5000 ఫైన్

by Harish |
నీళ్లను కార్లు కడగడం, తోటపనికి వాడితే రూ.5000 ఫైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. తాగటానికి ఉపయోగకరంగా ఉండే నీళ్లను కార్లు కడగడం, తోటపని, నిర్మాణాలకు, వాటర్ ఫౌంటైన్లకు ఉపయోగించడాన్ని నిషేధించింది. కేవలం ఇంట్లో ముఖ్యమైన అవసరాలకు మాత్రమే నిటిని వాడుకోవాలని ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు శుక్రవారం ఆర్డర్‌ను జారీ చేసింది. తీవ్రమైన నీటి కొరత దృష్ట్యా చాలా రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు నీటి వినియోగంపై ఇప్పటికే ఆంక్షలు విధించాయి. నీటి కొరతను ఆసరగా చేసుకుని కొంతమంది నీళ్ల ట్యాంకర్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ ట్యాంకర్ నీటి ధరను నిర్ణయిస్తూ సర్క్యులర్ జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed