రూ.6 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం

by Harish |
రూ.6 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం 48 గంటల ముందే లీక్ అయిందని దానిని డార్క్ వెబ్‌లో, ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రూ.6 లక్షలకు విక్రయించారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వర్గాలు ఒక మీడియాతో పేర్కొన్నాయి. అయితే పేపర్ ముందుగా ఎలా లీక్ అయిందనే వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయని, దీనికి గల కారణాలు తెలుసుకోడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కలిసి పని చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో గురువారం సీబీఐ తన మొదటి ఎఫ్‌ఐఆర్ నివేదికను దాఖలు చేసింది. దీనిలో మంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఆధారంగా ఇంకా గుర్తు తెలియని వ్యక్తులపై ఆరోపణలు చేసింది. పేపర్ లీక్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి రాకెట్ ఉందని, పరీక్ష నిర్వహణ అధికారుల పాత్ర కూడా ఉందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. పేపర్‌లను తయారు చేసిన వారిని, తనిఖీ చేసిన వారిని, మూల్యాంకనం చేసే వారిని, ప్రింట్‌ చేసిన పత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే వారితో పాటు పరీక్ష నిర్వహణలో పాల్గొన్న అధికారులను కూడా విచారించనున్నారు. అలాగే కోచింగ్ సెంటర్ల పాత్రపై దర్యాప్తులో భాగంగా విచారించే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అంతకుముందు లక్నో యూనివర్శిటీలో విద్యార్థులు ఒక పేపర్ లీక్ అయిందని, అది కేవలం రూ. 5,000కి అందుబాటులో ఉందని, జూన్ 16 నుండి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా షేర్ అయినట్లు వారు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed