షాకింగ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ పై రూ. 3 పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం

by Mahesh |   ( Updated:2024-06-15 12:36:28.0  )
షాకింగ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ పై రూ. 3 పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు షాక్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై దాదాపు 4 శాతం పన్నులు పెంచింది. ఇది ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇకపై లీటర్ పెట్రోల్ ధర రూ.3 పెరగనుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.3.50 పెరగనుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన దరలో తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలపై ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపనుంది. కర్ణాటకలో పెరిగిన ధరలతో పెట్రోల్ రూ. 102.85, డీజిల్ రూ. 88.93 చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయని అధికాలు వెళ్లడించారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకంటే ప్రతిపక్ష బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై కక్షసాదింపు చర్యలకు పూనుకుంటుందని ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం ప్రజల సంక్షేమ పథకాల అమలు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed