- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు ఏడాదికి రూ.లక్ష, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్: ‘నారీ న్యాయ్’ హామీ ప్రకటించిన కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు చెందిన ప్రతి మహిళకూ ఏడాదికి రూ.లక్ష సాయం అందిస్తామని ప్రకటించింది. అంతేగాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ‘నారీ న్యాయ్’ పేరుతో రూపొందించిన ఐదు హామీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐదు హామీల్లో మహాలక్ష్మి గ్యారంటీ, ఆధి ఆబది పూరా హక్(సగం జనాభా-పూర్తి హక్కులు), శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రి, సావిత్రీబాయి ఫూలే హాస్టల్ వంటివి ఉన్నాయి.
మహాలక్ష్మి గ్యారంటీ కింద పేద కుటుంబంలోని ప్రతి మహిళకూ ఏటా రూ లక్ష సాయం అందిస్తారు. ఆధి ఆబది పూరా హక్ గ్యారంటీ ప్రకారం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. శక్తి కా సమ్మాన్ స్కీమ్ ప్రకారం..అంగన్‌వాడీలు, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాలకు కేంద్రం అందిచే సహకారాన్ని రెట్టింపు చేస్తామని ఖర్గే తెలిపారు. ఇక, అధికార మైత్రి గ్యారంటీతో మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం, వారికి అవసరమైన సహాయం అందిస్తారు. ప్రతి పంచాయతీలో ఓ పారాలీగల్ అడ్వకేట్‌ను నియమించేలా ఏర్పాటు చేస్తారు. అలాగే ఐదో హామీలో అన్ని జిల్లా కేంద్రాల్లో శ్రామిక మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని ప్రకటించింది.
హామీలన్నీ నెరవేరుస్తాం: ఖర్గే
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిహామీనీ నెరవేరుస్తుందని మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. బూటకపు వాగ్ధానాలు చేయబోమని ప్రతి గ్యారంటీని అమలు చేస్తామని వెల్లడించారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు మేనిఫెస్టొల్లో చేర్చిన అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే క్రమంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని సూచించారు. బీజేపీ దేశంలోని నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు.