Wayanad landslides: ఏకైక వంతెన ధ్వంసం.. చుర్మలల పరిస్థితి అధ్వానం

by Shamantha N |   ( Updated:2024-07-30 10:34:28.0  )
Wayanad landslides: ఏకైక వంతెన ధ్వంసం.. చుర్మలల పరిస్థితి అధ్వానం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దాదాపు 54 మంది చనిపోయారు. కాగా.. భారీవర్షం వల్ల సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పర్యటక ప్రాంతమైన మెప్పాడులో పరిస్థితి అధ్వానంగా మారింది. ముండకైలో భారీగా ప్రాణనష్టం జరగింది. చలియార్ నది సమీపంలో దాదాపు 10 డెడ్ బాడీలు లభ్యం అయ్యాయి. ఇక చురల్మల సమీపంలోని ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసం అయ్యాయి. దీంతో, 250మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముండకై వరకే సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ తాత్కాలిక వంతెన నిర్మిస్తేనే ఆ ప్రాంతంతో సహాయకచర్యలు జరుగుతాయి. అసలు ఆ గ్రామంలో పరిస్థితి ఏంటో.. అస్సలు తెలియదు. అక్కడ కేవలం హెలికాప్టర్లతోనే స్వల్ప సాయం చేయగలిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కి చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండటంతో.. హెలికాప్టర్లు కూడా పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. కొండచరియలు విరిగిపిడన ప్రాంతంలో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో అవి కోజికోడ్ కు తిరిగివెళ్లాయి. కాగా.. పనమరం, కరమాంతొడే, కబానీ నదుల్లో నీటిమట్టం పెరిగిపోవడంతో బాణుసురసాగర్ డ్యాం గేట్లు ఎత్తివేశారు.

రంగంలోకి దిగిన ఆర్మీ

సహాయక చర్యలు చేపట్టేందుకు కన్నూర్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌ నుంచి రెండు వరద సహాయక కాలమ్స్ ను వయనాడ్‌కు తరలించారు. బెంగళూరు నుంచి ఆర్మీ ఇంజినీర్‌ కోర్‌ బృందం వయనాడ్ వెళ్లింది. కొండచరియలు తొలగింపు, తాత్కాలిక నిర్మాణాల్లో వీరికి నైపుణ్యం ఉంది. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఆర్మీచీఫ్‌ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు. ఇప్పటికే 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన రెండు కాలమ్స్‌ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

మెప్పాడి దగ్గర చిక్కుకుపోయిన 150 మంది

మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్టులో 150 మంది చిక్కుకుపోయారు. కొందరు స్థానికులు కూడా అక్కడే తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed