మణిపూర్‌లో చల్లారని అల్లర్లు..మరోసారి కుకీ, మెయితీ వర్గాల మధ్య కాల్పులు

by samatah |
మణిపూర్‌లో చల్లారని అల్లర్లు..మరోసారి కుకీ, మెయితీ వర్గాల మధ్య కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు చల్లారడం లేదు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటన మరువక ముందే మరోసారి కుకీ, మెయితీ వర్గాల మధ్య ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్ పోక్పి జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలోకి సమీపంలోని కొండపై నుంచి మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో గ్రామంలోని గోడలకు బుల్లెట్లు దిగాయని వెల్లడించారు. ఈ క్రమంలో పిల్లలు, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అంతకుముందు ఈనెల 26న ఇంఫాల్ తూర్పు సరిహద్దులోని సినామ్ కోమ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 33 ఏళ్ల గ్రామ వాలంటీర్‌ మృతి చెందాడు. కాగా, గతేడాది మే నుంచి ఇరు వర్గాల మధ్య హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed