క్రై ఆఫ్ ది అవర్.. ఆర్జీకర్ బాధితురాలి విగ్రహంపై నెట్టింట దుమారం

by Y.Nagarani |
క్రై ఆఫ్ ది అవర్.. ఆర్జీకర్ బాధితురాలి విగ్రహంపై నెట్టింట దుమారం
X

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 9న కోల్ కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో 31 సంవత్సరాల ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని నేటికీ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (RG Kar Medical College and Hospital) వద్ద డాక్టర్లు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సంఘటన జరిగి రెండు నెలలవుతున్నా ఇంకా దర్యాప్తు కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తాజాగా కాలేజీ ఆస్పత్రి ఆవరణలో మృతురాలికి నివాళిగా ఏర్పాటు చేసిన విగ్రహం.. ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

అత్యాచారానికి గురైన సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను చూపించేలా ఆసిత్ సైన్ అనే శిల్పి విగ్రహాన్ని రూపొందించారు. దానికి క్రై ఆఫ్ ది అవర్ (Cry of the Hour) అని పేరు పెట్టి.. కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే ఆవిష్కరించారు. అయితే ఇది బాధితురాలి విగ్రహం కాదని, ఆమె పడిన బాధ, అనుభవించిన హింసకు ప్రతీకగా ఏర్పాటు చేశామని శిల్పి వివరించారు. ఈ విగ్రహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేయగా.. ఇప్పుడు వాటిపై తీవ్ర దుమారం రేగుతోంది.

బాధితురాలి బాధను బాహ్యప్రపంచానికి వర్ణించే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచిదే అయినా.. ఇది ఆమెను అవమానించే చర్యే అవుతుందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలిని ఆధారంగా చేసుకుని ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. గౌరవంగా బ్రతికే ఏ మహిళా ఇలాంటి విగ్రహాలను సపోర్ట్ చేయదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed