- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు, నితీశ్ లపైనే ఉంది- సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇలాంటి టైంలో వారిపైన శివసేన యూబీటీ నాయకులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు, నితీశ్ కుమార్ పై ఉందని పేర్కొన్నారు. వారి మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతోందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యానికి సేవకులుగా భావించే వారికి ఇది అతిపెద్ద సవాల్ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎన్డీఏ కూటమికి మోడీ నాయకత్వం వహించారు. ఆదివారం రాత్రి 7.15 గంటలకు ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు.
దేశాన్ని నడిపేది ఆ ఇద్దరు వ్యాపారవేత్తలే..
షేర్ మార్కెట్ గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. షేర్ మార్కెట్ లో జరుగుతున్న అసాధారణ హెచ్చుతగ్గులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానికి సన్నిహితంగా ఉండే కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులకు ప్రయోజనం చేకూర్చేందుకు షేర్ మార్కెట్ దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. గుజరాత్ కు చెందిన ఇద్దరు వ్యాపారులే దేశాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. వారికి షేర్ మార్కెట్లతో సంబంధాలున్నాయని.. భవిష్యత్ లోనూ ఇలానే జరుగుతోందన్నారు. వారిద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.