"రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు"

by Mahesh |
రాజ్యాంగవిరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు
X

బెంగళూరు: మతాన్ని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కేటాయించాలని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటకలో బొమ్మై ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు 4 శాతాన్ని రద్దు చేయడాన్ని ఆయన సమర్థించారు. కర్ణాటకలో సర్దార్ వల్లభభాయి పటేల్ స్మారకం గరోటా షాహిద్ స్మారక్ ను ఆవిష్కరించారు. పక్షపాత రాజకీయాలతో మైనార్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు కేటాయించిందని విమర్శించారు.

అయితే బీజేపీ దీనిని రద్దు చేసి, వొక్కలిగ, లింగాయత్ కమ్యూనిటీలకు కేటాయించిందని చెప్పారు. కాగా, శుక్రవారం బొమ్మై ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలకు కల్పిస్తున్న 4శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీనిలో 2శాతం వీరశైవ-లింగాయత్ లకు, మరో రెండు శాతం వొక్కళిగ కమ్యూనిటీకి కేటాయించింది. ఓబీసీ ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలోకి మార్చింది.

Next Story

Most Viewed