- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిని మేం తొలగించం.. వాళ్లే తొలగించాలి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీని తమిళనాడు మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఓ సామాజిక కార్యకర్త వేసిన పిిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా తాము ఒక మంత్రిని పదవి నుంచి తొలగించలేమని స్పష్టం చేసింది. ‘‘ప్రస్తుతం తమిళనాడు క్యాబినెట్‌లో సెంథిల్ బాలాజీకి ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేనందున ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర సీఎంకే ఉంటుంది’’ అని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్ధించింది. ‘‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ ఒక మంత్రిని కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యత మాత్రం ముఖ్యమంత్రికే ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విషయాల్లో కోర్టు జోక్యం ఉండదని తెలిపింది.