- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు: ప్రధాని నరేంద్ర మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: భారత్ రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు పొందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. విదేశాల నుంచి పురాతన విగ్రహాలను సైతం దేశానికి తిరిగి తీసుకొస్తున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో శ్రీ కల్కీ ధామ్ ఆలయానికి మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఆలయ నమూనాను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో కాలం మారిందని.. ఓ వైపు పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతుంటే మరోవైపు, నగరాలు అత్యాధునిక మౌలిక సదుపాయాలను పొందుతున్నాయన్నారు. భారత్ కల100శాతం నెరవేరేలా కృషి చేస్తామన్నారు. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి పైగా ప్రజలకు శాశ్వత ఇళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. తీర్థయాత్రలతో పాటు దేశవ్యాప్తంగా హైటెక్ మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేశామన్నారు. భారతీయ విశ్వాసానికి కల్కీ ధామ్ మరో గొప్ప కేంద్రంగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన జనవరి 22వ తేదీ నుంచి దేశంలో కొత్త శకం ప్రారంభమైందని మోడీ చెప్పారు. ‘రాముడు పరిపాలించినప్పుడు, అతని ప్రభావం వేల సంవత్సరాల పాటు కొనసాగింది. అలాగే రాముని స్పూర్తితో రాబోయే వెయ్యి సంవత్సరాలకు భారతదేశానికి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. వందల ఏళ్లుగా మనపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి, అది మరేదైనా దేశం అయి ఉంటే, నిరంతర దాడుల వల్ల నాశనం అయ్యేది. మరోవైపు, 18 ఏళ్ల క్రితం చూసిన సనాతన ధర్మం కలను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు సంభాల్‌లోని శ్రీ కల్కి ధామ్‌కు తరలివచ్చారని కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.