- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ లోన్ యాప్స్‌పై పోరుకు ‘డిజిటా’
దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ రుణాల యాప్స్ పై పేరుకు సిద్ధమైంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్రమ రుణ యాప్స్ ని పరిష్కరించేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ.. డిజిటా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఆర్బీఐ డిజిటా ఏంటి అంటే?
డిజిటల్ డొమైన్‌లో ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి డిజిటా నుంచి యాప్ లకు ధ్రువీకరణ తప్పనిసరి. డిజిటా ధ్రువీకరణ లేకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్లు లెక్క. ఆ యాప్ లను అనధికారమైనవిగా పరిగణిస్తారు. రుణ యాప్ లను ధ్రువీకరించడం.. వాటి పబ్లిక్ రిజిస్టర్లను నిర్వహించడమే డిజిటా లక్ష్యం. మోసపూరిత కార్యకలాపాలు, అనైతిక పద్ధతులను నిలవరించేందుకే డిజిటా పనిచేస్తుంది. ముఖ్యంగా డిజిటల్ లెండింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేదుకు సమగ్ర ధ్రువీకరణ ప్రక్రియ జరగనుంది. ఇకపోతే గూగుల్ ప్లే స్టోర్ లో ధ్రువీకరించిన రుణ యాప్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
గూగుల్ వెయిట్‌లిస్టింగ్ కోసం 442 డిజిటల్ లెండింగ్ యాప్‌ల జాబితాను ఆర్‌బీఐ ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది. సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,200 రుణ యాప్ లను తీసివేసింది ప్రభుత్వం. ఆర్బీఐ నియంత్రిక సంస్థల భాగస్వామ్యంతో ఉన్న యాప్ లను మాత్రమే అనుమతించే విధానాన్ని గూగుల్ ఇప్పుడు అమలు చేస్తోంది.
ఇకపోతే.. కంబోడియాలో ఉపాధి కోసం వెళ్లి సైబర్ మోసాల్లో చిక్కుకుంటున్నారు భారతీయులు. వారిని రక్షించేందుకే ప్రభుత్వ ఈ చర్యలు తీసుకుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకారం, కంబోడియాలో చిక్కుకున్న 250 మందిని స్వదేశానికి తీసుకువచ్చారు. గత మూడు నెలల్లో మరో 75 మందిని కాపాడారు. కంబోడియాలో ఏకంగా 5వేల మంది చిక్కుకున్నట్లు తెలిపింది విదేశాంగశాఖ. మోసపూరిత నెట్ వర్క్ లను కూల్చివేసేందుకు కంబోడియా అధికారులు, భారతీయ ఏజెన్సీలతో కలిసి పనిచేసందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. అందుకోసం డిజిటా కూడా ఉపయోగపడుతుందని తెలుస్తోంది.