రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్

by Seetharam |   ( Updated:2023-06-08 05:43:23.0  )
రుణ గ్రహీతలకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రుణ గ్రహీతలకు ఆర్బీఐ ఊరట కల్పించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని ఆర్‌బీఐ ప్రకటించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్యవ్య పరిమితి విధాన సమీక్ష నిర్ణయాలను గురువారం ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఎంఎస్ఎఫ్ బ్యాంకు రేట్ కూడా 6.75 శాతం యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. ద్రవ్యోల్భణం తగ్గించేందుకే రెపోరేటు పెంచడం లేదని శక్తికాంతదాస్ తెలిపారు. కమిటీ విధానపరమైన చర్యలను సత్వరమే చేపట్టడం కొనసాగిస్తుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం బలంగా ఉన్నాయని వెల్లడించారు. దీంతో, రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించింది. గృహ రుణ వినియోగదారులపై అదనపు భారం లేనట్టైంది. ఈఎంఐల భారం నుంచి ఆర్‌బీఐ కాస్త ఊరటనిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed