- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థిరంగా RBI రెపో రేటు
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులపై ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కనికరించింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ విడత వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. రివర్స్ రెపోరేటు ఇంతకు ముందు మాదిరే 3.35 శాతంగా కొనసాగుతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిసమీక్ష ముగిసిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపీసీ నిర్ణయాలను గురువారం మీడియాకు వెల్లడించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ గతేడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటివరకు రెపోరేటును ఆరు సార్లు 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కాగా, ఈ రేట్లను పెంచకూడదన్న నిర్ణయం ప్రస్తుత సమీక్షకే పరిమితమని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. తద్వారా అవసరమైతే భవిష్యత్తులో రేట్లపెంపు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చారు.