కేరళలో అరుదైన వ్యాధి.. ఐదుగురి మృతి

by M.Rajitha |
కేరళలో అరుదైన వ్యాధి.. ఐదుగురి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రాన్ని మరో అరుదైన వ్యాధి పట్టి పీడిస్తోంది. అమీబిక్ మెనింజెస్ ఎన్సెఫాలిటీస్ అనే అరుదైన వ్యాధితో ఇప్పటికే ఐదుగురు చనిపోగా.. మరో పది మంది చికిత్స పొందుతున్నారు. 2024 జనవరిలో వెలుగులోకి వచ్చిన ఈ మెదడు ఇన్ఫెక్షన్ వ్యాధితో ఇప్పటి వరకు చనిపోయిన, చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. దేశంలో ఈ వ్యాధి గురించి ఎలాంటి మార్గదర్శకాలు లేవని, ఇది చాలా అరుదైన వ్యాధని అన్నారు. దీని చికిత్సకు కేంద్రం ఎలాంటి మందులు సరఫరా చేయడం లేదని, కేరళ ప్రభుత్వమే జర్మనీ నుండి మందులు కొనుగోలు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాధి నీటిలో ఉండే అమీబా ద్వారా వ్యాపిస్తుందని, బ్రైన్ సర్జరీ చేయించుకున్న లేదా ముక్కు సంబందిత ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఇది సులువుగా సోకుతుందన్నారు. కలుషితమైన నీటిని వాడటం, అలాంటి నీటితో స్నానం చేయడం, ఈదటం లాంటివి చేయవద్దని, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఎవరు ఆసుపత్రికి వచ్చినా ఆరోగ్య శాఖకు తెలియజేయాలని వీణా జార్జ్ కోరారు.

Next Story

Most Viewed