- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranveer Allahbadia: పార్లమెంటులో రణ్ వీర్ అల్హాబాదియా వ్యాఖ్యలపై చర్చ..!

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి 31 ఏళ్ల యూట్యూబర్ రణ్‌వీర్ అల్హబాదియా (Ranveer Allahbadia) వివాదంలో చిక్కుకున్నాడు. కాగా.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే ఛాన్స్ ఉంది. పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యూట్యూబర్ రణ్ వీర్ అల్లాబాడియాకు నోటీసు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ వివాదంతో ముడిపడి ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అల్హాబాదియాకు నోటీసులు పంపాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తోంది. అయితే, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. "ఇది చాలా దురదృష్టకరం.. ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలకు కఠినమైన మార్గదర్శకాలు, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా." అని పాత్రా అన్నారు. ‘కామెడీ కంటెంట్ పేరుతో భాషా పరిమితులు దాటడం ఆమోదయోగ్యం కాదు. ఒక ఫ్లాట్‌ఫామ్‌లో మీకు అవకాశం వచ్చిందంటే.. అక్కడ ఏదైనా మట్లాడవచ్చని కాదు. రణ్ వీర్‌కు అనేకమంది ఫాలోవర్లు ఉన్నారు. అనేకమంది రాజకీయ నాయకులు అతడి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా’ అని ప్రియాంక అన్నారు. మరోవైపు, కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు యూట్యూబ్‌పై కూడా చర్యలు తీసుకోవచ్చని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆ వీడియోను యూట్యూబ్ (YouTube) తొలగించింది. సమాచార, మంత్రిత్వశాఖ నుంచి ఆ సంస్థకు నోటీసులు అందడంతో ఈ పరిణామం జరిగింది.
అల్హాబాదియాపై కేసులు
రణ్‌వీర్ అల్హబాదియా.. కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న ఆయన ఆ షోలో పాల్గొన్నాడు. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను అతడు ప్రశ్నించాడు. కాగా.. ఈ ప్రశ్నపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)తో సహా ప్రతిపక్షాలు కూడా అతడిపై విమర్శలు గుప్పించారు. వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగపరిచాడంటూ ఫడ్నవీస్ మండిపడ్డారు. ఈనేపథ్యంలో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రణ్ వీర్ ఓ వీడియోను విడుదల చేశారు. మరోవైపు రణ్ వీర్‌పై పలువురు నేతలు సైతం కేసులు పెట్టారు. ఇప్పటికే ముంబై పోలీసులు విచారణకు రావాలంటూ అల్హాబాదియాకు నోటీసులు జారీ చేశారు. అల్హాబాదియా సహా షో జడ్జిలు, హోస్ట్ పై ఇప్పటికే అసోం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.