Ranjit Chautala: హర్యానాలో బీజేపీకి షాక్.. పార్టీకి మంత్రి రంజిత్ చౌతాలా రిజైన్

by vinod kumar |
Ranjit Chautala: హర్యానాలో బీజేపీకి షాక్.. పార్టీకి మంత్రి రంజిత్ చౌతాలా రిజైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. విద్యుత్ శాఖ మంత్రి రంజిత్ చౌతాలా పార్టీకి రిజైన్ చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో చౌతాలా అసంతృప్తి చెందారు. అనంతరం గురువారం తన మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. సిర్సా జిల్లాలోని రానియా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. దబ్వాలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయమని బీజేపీ హైకమాండ్ నన్ను కోరిందని, అయితే అక్కడి నుంచి పోటీ చేయడం నాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

రంజిత్ మాజీ డిప్యూటీ పీఎం చౌదరి దేవి లాల్ కుమారుడు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరగా హిస్సార్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీలో చేరిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ మంద్రి పదవి కట్టబెట్టింది. అయితే ఆయన గతంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన సిర్సా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించగా..ఆ స్థానం నుంచి శిష్పాల్ కాంబోజ్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఈ నేపథ్యంలోనే రంజిత్ చౌతాలా అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ 57 మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed