ఆయనను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలి.. కేంద్రానికి రైతు సంఘాల నేతల అల్టిమేటం

by Javid Pasha |   ( Updated:2023-06-02 13:24:14.0  )
ఆయనను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలి.. కేంద్రానికి రైతు సంఘాల నేతల అల్టిమేటం
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకుంటే జూన్ 9న అథ్లెట్లతో కలిసి జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అదే విధంగా దేశవ్యాప్తంగా పంచాయితీలు నిర్వహిస్తామని అన్నారు. తమను లైంగికంగా వేధించిన ఫెడరేషన్ చీఫ్ అరెస్ట్ చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న అథ్లెట్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.

వాళ్లపై పెట్టిన కేసులను వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారని మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, కోర్టులో చూసుకుంటామని చెప్పారు.

Also Read..

అది బీజేపీ ప్రమాదకర ఎజెండా.. రాష్ట్రాల హక్కులకు భంగం: చిదంబరం

Advertisement

Next Story