Parliament Sessions: ఐదోరోజూ సజావుగా జరగని పార్లమెంట్.. కుదిపేస్తోన్న అదానీ ఇష్యూ

by Rani Yarlagadda |
Parliament Sessions: ఐదోరోజూ సజావుగా జరగని పార్లమెంట్.. కుదిపేస్తోన్న అదానీ ఇష్యూ
X

దిశ, వెబ్ డెస్క్: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు (Assembly Winter Sessions) ఐదో రోజు కూడా సజావుగా జరగలేదు. ఉభయ సభలు ప్రారంభమవ్వడమే ఆలస్యం.. విపక్షాల సభ్యులు అదానీ ఇష్యూపై చర్చించాలని ఆందోళన చేస్తున్నారు. సభకు సహకరించాలని ఇటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla), అటు రాజ్యసభ ఛైర్మన్ సభ్యులను కోరినా వినట్లేదు. ముందు ఈ విషయంపై చర్చించాల్సిందేనని పట్టుపడుతున్నారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిరోజూ సెషన్స్ ప్రారంభమవ్వడం, అదానీ ఇష్యూపై విపక్షాలు ఆందోళన చేయడం.. సభలు వాయిదా పడటం.. ఇదే రిపీట్ అవుతోంది. ఈ రోజు కూడా అదే జరిగింది.

గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల కేసుపై చర్చ జరగాలని విపక్షాలు ఆందోళన చేశాయి. దీనిపై జేపీసీ వేయాలని పట్టుబట్టడంతో.. లోక్ సభ ప్రారంభమైన గంటకే వాయిదా పడింది. రాజ్యసభలోనూ సభ్యులు ఆందోళన చేయడంతో.. సభను డిసెంబర్ 2 (సోమవారం)కు వాయిదా వేశారు ఛైర్మన్ జగదీప్ ధన్కర్.

Advertisement

Next Story

Most Viewed