Rajnath singh: పదేళ్లలో 10 రెట్లు పెరిగిన రక్షణ ఎగుమతులు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by vinod kumar |   ( Updated:2024-12-30 14:57:33.0  )
Rajnath singh: పదేళ్లలో 10 రెట్లు పెరిగిన రక్షణ ఎగుమతులు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ రంగంలో గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారాలన్న భారత్‌ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందని, గత దశాబ్ద కాలంలో రక్షణ ఎగుమతులు (Defence exports) పది రెట్లు పెరిగాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో నిర్వహించిన కళాశాలలో ఆయన ప్రసంగించారు. ‘దశాబ్దం క్రితం రూ. 2,000 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు నేడు రికార్డు స్థాయిలో రూ. 21,000 కోట్లకు చేరుకున్నాయి. 2029 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వెల్లడించారు.

ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రాక్సీ వార్‌ఫేర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్‌ఫేర్, స్పేస్ వార్‌ఫేర్, సైబర్‌టాక్‌లతో సహా సాంప్రదాయేతర యుద్ధ సాధనాలు నేటి కాలంలో పెద్ద సవాల్‌గా మారాయన్నారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు సైన్యం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న అస్థిర పరిస్థితులపైనా రాజ్ నాథ్ స్పందించారు. ‘నేడు ప్రపంచంలో చాలా చోట్ల సంఘర్షణలు జరుగుతున్నాయి. అలాగే మరి కొన్ని దేశాల్లో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. చుట్టూ అనిశ్చితి వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ సంబంధాల్లోనూ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి’ అని తెలిపారు.


Read More..

IS : ‘ఇస్లామిక్ స్టేట్’పై బ్యాన్‌ను సవాల్ చేస్తూ పిటిషన్.. జనవరి 22న ‘సుప్రీం’ విచారణ

Advertisement

Next Story

Most Viewed