అభ్యాస్ ట్రయల్స్ సక్సెస్..డీఆర్డీవోకు రాజ్‌నాథ్ అభినందనలు

by Vinod |
అభ్యాస్ ట్రయల్స్ సక్సెస్..డీఆర్డీవోకు రాజ్‌నాథ్ అభినందనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్) ‘అభ్యాస్’ ఆరు దశల ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) గురువారం తెలిపింది. ఒడిశా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఈ ట్రయల్స్ జరిగాయి. దీంతో మొత్తం 10 ట్రయల్స్‌ను అభ్యాస్ విజయవంతంగా నిర్వహించింది. టెస్టింగ్, ప్రాక్టీస్ సెషన్‌ల సమయంలో క్షిపణులు, ఇతర పేలోడ్‌ల కోసం హీట్ ఉపయోగపడుతుందని డీఆర్డీఓ తెలిపింది. ‘అభ్యాస్ ట్రయల్ సమయంలో, బూస్టర్‌ల సురక్షిత విడుదల, లాంచర్ క్లియరెన్స్ ఎండ్యూరెన్స్ పనితీరు, వివిధ మిషన్ లక్ష్యాలు సాధించింది. రెండు ప్రయోగాలు 30 నిమిషాల వ్యవధిలో వెంట వెంటనే నిర్వహించాం’ అని డీఆర్డీఓ వెల్లడించింది. ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవోకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. కాగా, అభ్యాస్‌ను డీఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూపొందించగా..హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.

Next Story

Most Viewed