- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకే పార్టీపై రజనీకాంత్ ప్రశంసలు
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలపై స్టార్ హీరో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు అసక్తిగా మారాయి. హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ రజనీకాంత్ డీఎంకే పార్టీని పొగడటం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారింది. హీరో రజనీకాంత్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది. దాన్ని ఎవరు కదిలించలేరు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు మారిపోయినట్లు తెలుస్తుంది. గతంలో సొంతంగా పార్టీ పెట్టిన రజనీకాంత్.. ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ పార్టీకి అప్పుడప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. అలాంటిది హీరో విజయ్ పార్టీ ఏర్పాటు జెండా ఆవిష్కరణ జరిగిన క్రమంలో డీఎంకే పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని అనడంతో ప్రస్తుతం తమిళనాడులో తీవ్రమైన చర్చ జరుగుతోంది.