- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్లో శ్రద్ధా తరహా హత్య.. చంపేసి శరీర భాగాలు విసిరేసి..
జైపూర్: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరవకముందే రాజస్థాన్లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. నాగౌర్ లోని ఓ వ్యక్తి పెళ్లి చేసుకోమన్నందుకు తన ప్రేయసిని ముక్కలుగా నరికాడు. అయితే అప్పటికే యువతికి వేరే వ్యక్తితో పెళ్లి అయినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ యువతి తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో సదరు వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు ప్రాంతాల్లో పారేసినట్లు విచారణలో తేలింది. యువతి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యువకుడు 25 రోజుల క్రితమే ఆమెను హత్య చేసినట్లు తేలింది. అత్తవారింటి వెళ్తున్నానని చెప్పిన యువతి మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వ్యక్తితో పెళ్లి అయినప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో హతమార్చినట్లు నిందితుడు వెల్లడించాడు. మృతదేహ భాగాలను పాడుబడ్డ బావిలో వేయగా, పోలీసులు డీఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.