VandeBharat Sleeper Train: యూరోపియన్ సౌకర్యాలతో వందేభారత్ స్లీపర్ ట్రైన్

by Julakanti Pallavi |
VandeBharat Sleeper Train: యూరోపియన్ సౌకర్యాలతో వందేభారత్ స్లీపర్ ట్రైన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రైల్వే స్థాయి ప్రపంచ స్థాయికి చేరడంలో మరో అడుగు ముందుకు పడబోతోంది. అతి త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. వందేభారత్ స్లీపర్‌ రైలుకు సంబంధించిన ఫోటోలతో పాటు బెంగళూరులోని బీఈఎంఎల్ రైల్వే స్టేషన్లో రైలును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. దీనికి ‘ప్రపంచంలోనే బెస్ట్ కావాలి’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశారు.

కాగా.. భారత్ ఎర్త్ మువర్స్ లిమిటెడ్, బెంగళూరులో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే, జలశక్తి శాఖల సహాయ మంత్రి వి సొమ్మన్న వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును టెస్ట్ డ్రైవ్ చేశారు.

అనంతరం ఈ స్లీపర్ ట్రైన్‌ ప్రత్యేకతలను వివరిస్తూ.. అధునాతన సాంకేతికత, సౌకర్యాలను పొందు పరిచినట్లు రైల్వే తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచబోతోందని, అలాగే ఈ ట్రైన్‌ని తయారు చేయడానికి అత్యాధునిక అగ్ని నిరోధక మెటీరియల్‌ని వినియోగించామని వివరించారు.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో, అందమైన ఇంటీరియర్స్‌తో యూరోపియన్ స్టైల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో ఏసీ 3 టైర్, ఫస్ట్ క్లాస్ ఏసీ బెర్త్‌‌లు ఉండనున్నాయని, మొత్తం 823 మంది ప్రయాణించేలా 16 బెర్త్‌లు ఉంటాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed