- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బొగ్గు సైకిల్‌ను తోసిన రాహుల్: జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర పరిణామం
by samatah |
X
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో యాత్ర కొనసాగుతుండగా రోడ్డుపై కార్మికులు తమ సైకిళ్లపై 200 నుంచి 250 కిలోల బరువున్న బొగ్గును తీసుకెళ్లడం చూశారు. దీనిని గమనించిన రాహుల్ వారి వద్దకు వెళ్లాడు. వారితో ముచ్చటించిన అనంతరం.. బొగ్గు సైకిల్‌ను తోసేందుకు ప్రయత్నించారు. ఈ పోటోలను కాంగ్రెస్ ఎక్స్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘భారతదేశాన్ని నిర్మించడంలో నిమగ్నమైన కార్మికులు తమ కష్టానికి సమానమైన ప్రతిఫలం పొందాలి. వారికి న్యాయం జరగాలి.. ఇదే జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం’ అని కాంగ్రెస్ పేర్కొంది. కాగా, జోడో న్యాయ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను కవర్ చేస్తూ 804 కిలోమీటర్ల మేర సాగనుంది.
Advertisement
Next Story