రాహుల్ గాంధీ మూలాలకు భారత నేలతో సంబంధం లేదు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

by Mahesh |
రాహుల్ గాంధీ మూలాలకు భారత నేలతో సంబంధం లేదు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ.. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విధంగా విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను చెడగొట్టడం ‘దేశ వ్యతిరేక’ చర్య అని కేంద్ర మంత్రి అన్నారు. రాహుల్ గాంధీ మూలాలకు భారత నేలతో సంబంధం లేదని.. ఆయన చర్యలు దేశ వ్యతిరేకం అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మండిపడ్డారు. కాగా డల్లాస్ లో రాహుల్ గాంధీ ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భారతదేశం యుఎస్, పశ్చిమ దేశాలోని ఇతర దేశాలు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నాయని చైనాలో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అలాగే భారతదేశం "ఒక ఆలోచన" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని విశ్వసిస్తున్నారని విమర్శించారు. భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం లేకుండా పోయాయని రాహుల్ గాంధీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed