Rahul Gandhi Bharat Jodo Yatra : ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Nagaya |   ( Updated:2023-01-30 08:45:18.0  )
Rahul Gandhi Bharat Jodo Yatra : ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్ర తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, యాత్రలో భాగంగా ప్రజల కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం శ్రీనగర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఉపయోగం లేదని, తాము అధికారంలోకి వస్తే కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. మతం హింసను ప్రేరేపించదని ప్రేమను పంచుతుందని చెప్పారు. కానీ మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ హింసను ప్రేరేపించారన్నారు. మా పూర్వీకులు కశ్మీర్ నుంచే వచ్చారు. కానీ ఇప్పుడు కశ్మీర్ కష్టాల్లో ఉంది. కశ్మీర్ ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ సభకు మంచువర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. విరామం లేకుండా కురుస్తున్న మంచులోనే రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కొనసాగించారు.

నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి

చలి, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు భారత్ జోడో యాత్ర సభలకు హాజరయ్యారన్నారు. పాదయాత్రకు సహరించిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు. ప్రజల సహకారం చూసి నా కళ్లెంబడి నీళ్లు వచ్చాయని చెప్పారు. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మీ అందరి మద్దతుతోనే నడిచానన్నారు. భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరినట్టే. నా పాదయాత్రలో ఎందరో దుస్తులు లేని వాళ్లను చూశా. ప్రజల దీనస్థితి చూసే టీ షర్టుతో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నా అన్నారు. వేధింపులకు గురైన ఎందరో మహిళలు నాతో బాధలు చెప్పుకున్నారు. దేశ యావత్ శక్తి మనతోనే ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed