- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీ.. రాజీవ్‌గాంధీ.. ఆ విషయంలో సేమ్ టు సేమ్ : ఏకే ఆంటోనీ
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : రాహుల్ గాంధీని దివంగత కాంగ్రెస్ దిగ్గజ నేత రాజీవ్‌గాంధీతో పోలుస్తూ ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజీవ్‌గాంధీలాగే రాహుల్ గాంధీకి కూడా రాజకీయ వ్యామోహం లేదు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ చేస్తున్న పోరాటం కూడా ప్రధానమంత్రి కావడానికి కాదు. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడేందుకే’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాహుల్ గాంధీ దృఢ సంకల్పం, ధైర్యసాహసాలకు మారుపేరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తన నిర్ణయాలను మార్చుకోని ధీరుడు’’ అని ఏకే ఆంటోనీ చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం అత్యంత విశ్వసనీయ నాయకుడిగా రాహుల్ ఎదిగారని కితాబిచ్చారు. రాహుల్ గాంధీపై ప్రముఖ జర్నలిస్టు ఎన్ అశోకన్ రాసిన పుస్తకాన్ని కేరళలోని తిరువనంతపురంలో విడుదల చేసిన సందర్భంగా ఏకే ఆంటోనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story