- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త పార్లమెంట్ను రాష్ట్రపతి ప్రారంభించాలి.. రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: కొత్త పార్లమెంట్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ఉన్నాక ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదని అన్నారు. మోడీ ఏది చేసిన రాజకీయ లబ్ది కోసమే చేస్తారని విమర్శించారు. కాగా మే 18న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రదాని మోడీని కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానం అందజేశారు. అందుకు మోడీ అంగీకరించగా.. ఈ నెల 28న మోడీ కొత్త పార్లమెంట్ ను ప్రారంభించనున్నారు. కాగా మే 28 వీడీ సావర్కర్ జయంతి అని.. కావాలనే మోడీ ఆ రోజును పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారని కొంతమంది విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నాయకులకు ఇది అవమానకరం అని అన్నారు. కాగా 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవన నిర్మానానికి పీఎం మోడీ శంకుస్థాపన చేశారు. మొత్తం 1,280 మంది సభ్యులు కూర్చునే విధంగా ఈ పార్లమెంట్ ను నిర్మించారు. ఇందులో లోక్ సభలో 888 మంది, రాజ్య సభలో 300 మంది కూర్చునే విధంగా నిర్మించారు.
Also Read...
కాంగ్రెస్ మరింత త్యాగం చేయాల్సిందే: మెహబూబా ముఫ్తీ షాకింగ్ కామెంట్స్