ముంబై రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై స్పందించిన రాహుల్ గాంధీ

by Mahesh |   ( Updated:2024-11-03 14:14:40.0  )
ముంబై రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై స్పందించిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై (Mumbai) మహా నగరంలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బాంద్రా (Bandra)లోని టెర్మినస్ రైల్వే స్టేషన్‌ (Terminus Railway Station)లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీపావళి(Diwali) పండుగ నేపథ్యంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో ట్రైన్ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పదుల సంఖ్యలో గాయపడ్డ.. కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎక్కడైనా సరే ప్రారంభోత్సవాలుచ రిబ్బన్ కటింగ్ లు చేసి.. వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని,, ముంబైలోని బాంద్రా టెర్మినస్ స్టేషన్‌లో ఈ రోజు జరిగిన తొక్కిసలాట ప్రభుత్వం నాసిరకం మౌలిక సదుపాయాలకు ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. గత ఏడాది జూన్‌లో జరిగిన బాలాసోర్ రైలు ప్రమాదంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బాధితులకు పరిహారం ఇవ్వడానికి బదులుగా, బిజెపి ప్రభుత్వం సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుందని విమర్శించారు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం 9 నెలల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూడా పడిపోయిందంటే, దీని ఉద్దేశ్యం కేవలం ప్రచారమే అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో శివాజీ మహారాజ్‌కు గౌరవం లేదు, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని రాహుల్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed