మరో వివాదంలో రాహుల్ గాంధీ.. రెజీమ్ ఛేంజర్ డొనాల్డ్ లూ ని అందుకే కలిశారా..?

by karthikeya |   ( Updated:2024-09-12 14:46:35.0  )
మరో వివాదంలో రాహుల్ గాంధీ.. రెజీమ్ ఛేంజర్ డొనాల్డ్ లూ ని అందుకే కలిశారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బద్ధవ్యతిరేకి, పాకిస్తాన్ (America) అంటే ప్రేమ కలిగిన అమెరికా చట్టసభ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌ (Ilhan Omar)తో భేటీ వివాదం చల్లారకముందే ఇప్పుడు మరో వివాదాస్పద వ్యక్తిని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ కలవడం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికన్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ (Donald Lu)ను కలిశారు. ఈయన అమెరికా ప్రభుత్వం తరుపున సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా వ్యవహరాల అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్నాడు. అయితే ఈయనకి రెజిమ్ ఛేంజర్‌ (Regime Changer)గా పేరుంది. ఇంతకుముందు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలను దించి, కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ఈయన కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సైతం డొనాల్డ్ లూ కుట్ర వల్లే తన ప్రభుత్వం పడిపోయిందని వ్యాఖ్యానించారు.

అంతకుముందు శ్రీలంక (Srilanka)లో పర్యటించాడు డొనాల్డ్ లూ. ఆ తర్వాతే అక్కడ గోటబయ రాజపక్స (Gotabaya Rajapaksa)పై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం కూలిపోయింది. దేశం అల్లకల్లోలమైంది. ఇక చివరిగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అల్లర్లు, హేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి ముందు కూడా డొనాల్డ్ లూ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాడు. ఆ తర్వాతే బంగ్లాదేశ్‌ (bangladesh)లో అల్లకల్లోలం మొదలైంది.

ఈ దేశాలు మాత్రమే కాదు.. అంతకుముందు కిర్గిజ్‌స్తాన్‌ (kirzikistan)లో అమెరికా రాయబారిగా ఉన్న సమయంలో అక్కడ అంతర్యుద్ధానికి ఆజ్యం పోశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ఈయన అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రభుత్వాలు పడిపోయాయి. తిరుగుబాట్లు మొదలయ్యాయి. దేశాలు అల్లకల్లోలం అయ్యాయి.

ఇలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ కలవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ (BJP) సర్కార్‌ను గద్దె దించడం కోసమే డొనాల్డ్ లూని రాహుల్ కలిశారని బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే అమెరికా విదేశాంగ ప్రతినిధి మాత్రం ఇది కేవలం సాధారణ భేటీ అని చెప్పారు. కాగా.. మరికొద్ది రోజుల్లో డొనాల్డ్ లూ భారత్‌‌ (India)లో పర్యటించనున్నారు. ఇండియా-అమెరికా మధ్య జరిగే విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే సమావేశంలో ఈయన పాల్గొనబోతున్నారు.

Advertisement

Next Story