ఆ రాష్ట్రంలో 150 సీట్లు గెలిచి.. అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఆ రాష్ట్రంలో 150 సీట్లు గెలిచి.. అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక విజయంతో కాంగ్రెస్ మిగతా రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో తమ పార్టీనే విజయం సాధించబోతోందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మధ్యప్రదేశ్ పీసీసీ కమల్ నాథ్‌తో సహా ఆ రాష్ట్ర నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. మధ్య ప్రదేశ్‌లో మాకు 150 సీట్లు వస్తాయని చెప్పారు. తాము మధ్యప్రదేశ్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించామని మా అంతర్గత అంచనాల్లో కర్ణాటకలో మాకు 136 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ లోనూ మాకు 150 సీట్లు తప్పక వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

అయితే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్ నాథే ఉంటారా అనే మీడియా ప్రశ్నను రాహుల్ గాంధీ దాటవేశారు. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలతో ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కమల్ నాథ్ వర్సెస్ జ్యోతిరాదిత్య సింధియా మధ్య జరిగిన ఆధిపత్యపోరుతో కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. దీంతో ఈ సారైనా పక్కా వ్యూహంతో కాంగ్రెస్ వర్కౌట్ చేయగలుగుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

Advertisement

Next Story