Rahul Gandhi T-shirtపై జోరుగా చర్చ.. దీనిపై ఆయన ఏమన్నారంటే?

by Javid Pasha |   ( Updated:2022-12-28 06:21:08.0  )
Rahul Gandhi T-shirtపై జోరుగా చర్చ.. దీనిపై ఆయన ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ ఆవిర్భవించి నేటికి 138 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని AICC కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోనియా, పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అంబికాసోనీ, జైరాం రమేశ్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీ షర్ట్ లో వచ్చిన రాహుల్.. అందరిని పలకరిస్తూ జోడో యాత్రను తలపించారు. రాజకీయ మీటింగులకు రాహుల్ ఎక్కువగా లాల్చీ, పైజామాలో వస్తుంటారు. కానీ ఈసారి ఆయన తెలుపు టీ షర్ట్ ధరించి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడందరూ ఆయన టీ షర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం ఓ రిపోర్ట్ 'ఇవాళ కూడా టీ షర్ట్ లోనే వచ్చారా?' అని రాహుల్ ని అడగ్గా.. '' ఇప్పుడంతా టీ షర్ట్ దే నడుస్తోంది. ఎప్పటి దాకా నడుస్తుందో నడవనీయండి'' అంటూ సమాధానమిచ్చారు. రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధాని మోడీని ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అలాంటిదేం లేదని, టీ షర్ట్ ధరించే రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారని, అదే విషయాన్ని రాహుల్ చెప్పారని కాంగ్రెస్ అభిమానులు చెబుతున్నారు.

Also Read...

కాంగ్రెస్ పార్టీ @138

Advertisement

Next Story

Most Viewed