- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. ఎందుకో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఒక పార్టీపై మరో పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన రాజస్థాన్ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ నేతలు కంప్లయింట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కపోవడంతో రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీపై కుట్ర పన్నుతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. భాష, ప్రాంతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ కుట్ర పన్నుతున్నారు’’ అని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీజేపీ నేత తరుణ్ చుగ్ పేర్కొన్నారు. అబద్ధాలు, కుట్రలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేయడంలో రాహుల్ గాంధీ దిట్ట అని ఆయన ఆరోపించారు.