- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi : బైక్ మెకానిక్‌గా అవతారమెత్తిన రాహుల్ గాంధీ..
దిశ, వెబ్ డెస్క్ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్తగా బైక్ మెకానిక్ అవతారమెత్తారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఓ బైక్ మెకానిక్ షాపుకు వెళ్లి ఆయన.. అక్కడ మెకానిక్‌గా మారిపోయారు. అదేవిధంగా అక్కడే మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులు, మెకానిక్‌లతో ముచ్చటించి వారితో కరచాలనం చేశారు. ఈ కార్మిక చేతులే భారత్‌ను నిర్మిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బైక్ మెకానిక్‌లతో రాహుల్ మాట్లాడుతూ, బైక్ లను ఎలా రిపేర్ చేయాలో అడిగి తెలుసుకున్నారు.
సైకిల్ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులతో కాసేపు ఆయన ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఫోటోలను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెంచీలను తిప్పుతూ మన దేశ చక్రాలు ముందుకు సాగేలా చేస్తున్న వారి నుంచి ఎంతో నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. కార్మికుల చేతులే నవ భారత్‌ను నిర్మిస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. మెకానిక్ బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం ఆత్మాభిమానమని చెప్పుకొచ్చారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది.