అదానీలా మారాలని ఉంది.. ఆ సీక్రెట్ చెప్పండి: కేంద్రంపై రాహుల్ సెటైర్లు

by Satheesh |   ( Updated:2023-02-07 11:42:42.0  )
అదానీలా మారాలని ఉంది.. ఆ సీక్రెట్ చెప్పండి: కేంద్రంపై రాహుల్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. అదానీ, అగ్నివీర్ ఇష్యూస్‌ను టార్గెట్ చేస్తూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం లోక్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న ముంబై విమానాశ్రయాన్ని జీవీకే నుండి లాక్కొని అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. అదానీ ఆస్తులు 8 బిలియన్ డాలర్ల నుండి కొద్ది కాలంలోనే 180 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. భారత్-ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందాలన్నీ అదానీకే అప్పగించారని అన్నారు. దేశం మొత్తం అదానీ గురించి మాట్లాడుకుంటుందని.. ప్రధాని మోడీ-అదానీ మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. మోడీ ఏ దేశం వెళ్తే అక్కడ కాంట్రాక్టులన్నీ అదానీకి వస్తున్నాయని ఆరోపించారు. అదానీ చేసిన అన్ని వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అయ్యారో చెప్పాలని.. తనకు అదానీలా మారాలని ఉందని.. ఆ సీక్రెట్ చెప్పాలని కేంద్రంపై సెటైర్లు వేశారు.

చివరికి భారత్ దేశం మొత్తాన్ని అదానీకి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో ఎంతో మంది నిరుద్యోగులు తనను కలిశారని.. అగ్నివీర్‌పై యువకుల్లో అసంతృప్తి కనిపించిందని రాహుల్ పేర్కొన్నారు. అగ్నివీర్ స్కీమ్ ఆర్ఎస్ఎస్ విధానంలా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఎంతో మంది యువత ఉన్నత చదువులు చదివి క్యాబ్స్ నడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు, రైతు సమస్యలే అధికంగా ఉన్నాయన్నారు. కాగా, రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని బీజేపీ అడుగడుగునా అడ్డుపడటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

Read More: మోడీకి మెస్సీ జెర్సీ గిఫ్ట్!

Advertisement

Next Story