- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
దిశ, నేషనల్ బ్యూరో: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. 2018, ఆగష్టు నాటి హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుల్తాన్ పూర్ జిల్లా కోర్టు మంగళవారం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరులో రాహుల్ గాంధీ అమిత్ షాపై ఆరోపణలు చేశారు. దీనిపై విజయ్ మిశ్రా అనే వ్యక్తి సుల్తాన్‌పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా, జిల్లా సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ, అనంతరం భారత్ జోడ్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు అమేథీకి వెళ్లారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారంతో 38వ రోజుకు చేరుకుంది. అమేథీ జిల్లాలోని ఫుర్సంత్‌గంజ్‌లో ప్రారంభమైన యాత్ర రాయ్‌బరేలీ, లక్నో వైపు సాగింది. ఇక, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 24న యూపీలోని మొరాదాబాద్ నుంచి ఈ యాత్రలో పాల్గొంటారు.