- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rahman: ముజిబుర్ రెహమాన్ నివాసంపై దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) నివాసాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఆక్రమణ, అణచివేత శక్తులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ (Bangladesh) ప్రజల వీరోచిత ప్రతిఘటనకు చిహ్నంగా ఉన్న షేక్ ముజిబుర్ చారిత్రాత్మక నివాసం ధ్వంసం కావడం విచారకరం. ఇది బంగ్లాదేశ్ గుర్తింపు, గర్వాన్ని పెంపొందించింది. స్వాతంత్ర్య పోరాటానికి విలువనిచ్చే వారందరికీ ఈ నివాసం ప్రాముఖ్యత గురించి తెలుసు. కాబట్టి ఈ విధ్వంసక చర్యను తీవ్రంగా ఖండించాలి’ అని పేర్కొంది. కాగా, ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు రెహమాన్ నివాసంపై బుధవారం అర్ధరాత్రి నిరసనకారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇంటిలోని పలు వస్తువులను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ ఘటనపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రెచ్చగొట్టే ప్రసంగం చేయడం వల్లే హింస నెలకొందని ఆరోపించింది.