Lucknow Airport: రేడియోధార్మిక పదార్థం కలకలం

by Shamantha N |
Lucknow Airport:  రేడియోధార్మిక పదార్థం కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: లక్నో ఎయిర్ పోర్టులో రేడియోధార్మిక పదార్థం కలకలం రేపింది. లోక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో ప్రాంతంలో రేడియోయాక్టివ్ మెటీరియల్ కన్పించింది. శనివారం ఎయిర్ పోర్టులోని కార్గో ప్రాంతంలో ఈ మెటీరియల్ కన్పించడంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఎన్డీఆర్ఎఫ్ ను రంగంలోకి దించారు. మెడికల్ కన్సైన్‌మెంట్‌ను స్కాన్ చేస్తున్నప్పుడు రేడియోధార్మిక పదార్థం గుర్తించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. అలారం మోగడంతో అప్రమత్తమైనట్లు పేర్కొన్నారు. అయితే, ఈ మెటీరియల్ గుర్తించిన వెంటనే అప్రమత్తం కావడంతో విమాశ్రయ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. అయితే, రేడియోయాక్టివ్ మెటీరియల్ ఏంటనే దాని గురించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనాస్థలిలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు తనిఖీలు చేపడుతున్నారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed