- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ప్రశ్నల వర్షం.. ఈడీ ఎదుట హాజరైన రబ్రీ దేవి
న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ (ఉద్యోగాలకు బదులు భూమి) కుంభకోణానికి సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వచ్చిన రబ్రీదేవి ఒంటి గంటకు లంచ్ కోసం బయటికెళ్లి మళ్లీ రెండు గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే రబ్రీదేవి కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, కుమార్తెలు మీసా భారతి, చందా యాదవ్, రాగిణి యాదవ్ లను కూడా ప్రశ్నించింది.
పాట్నా, ఢిల్లీ, రాంచీ, ముంబై నగరాల్లోని చందా యాదవ్, రాగిణి యాదవ్, హేమా యాదవ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే దోజనకు సంబంధించిన నివాసాల్లో ఈడీ ఇప్పటికే సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఒక కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్న ఈడీ మరో రూ.600 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ కేసును సీబీఐ నమోదు చేసింది.