Mass Resignation : మూకుమ్మడి రాజీనామాలకు మరో 77 మంది డాక్టర్లు రెడీ

by Hajipasha |
Mass Resignation : మూకుమ్మడి రాజీనామాలకు మరో 77 మంది డాక్టర్లు రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు సంఘీభావంగా సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే బెంగాల్‌లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200మందికిపైగా సీనియర్‌ డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తాజాగా కల్యాణి జేఎన్‌ఎం ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన 77మంది సీనియర్ వైద్యులు రాజీనామాలకు రెడీ అయ్యారు. ఈవిషయాన్ని వారు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఈ మెయిల్‌ ద్వారా తెలిపారు.

అక్టోబర్‌ 14లోగా జూనియర్ వైద్యురాలికి న్యాయం చేయకుంటే తమ విధులను నిలిపివేస్తామని కల్యాణి జేఎన్‌ఎం ఆస్పత్రి సీనియర్ డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 5 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్‌.ఎస్‌.నిగంను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితేే వైద్యుల మూకుమ్మడి రాజీనామాలు లీగల్‌గా చెల్లుబాటు కావని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

Next Story

Most Viewed