రాహుల్‌పై కేసు పెట్టిన పూర్ణేశ్‌కు బీజేపీ కీలక పదవి

by GSrikanth |
రాహుల్‌పై కేసు పెట్టిన పూర్ణేశ్‌కు బీజేపీ కీలక పదవి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని కొల్లార్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ ‘మోడీ ఇంటి పేరు’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మోడీ ఇంటి పేరు వ్యవహరంలో రాహుల్‌పై పరువు నష్టం కేసు పెట్టిన బీజేపీ నేతకు కీలక పదవి దక్కింది. రాహుల్‌గాంధీపై సూరత్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీని దాద్రానగర్ హవేలీ- దామన్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జీగా బీజేపీ అధిష్టానం నియమించింది. మరో బీజేపీ నేత దుష్యంత్ పటేల్‌కు కో- ఇన్‌చార్జీగా నియమిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా ప్రకటించారు.

Advertisement

Next Story