Delhi high court: పూజా ఖేడ్కర్‌ను అప్పటి వరకు అరెస్టు చేయొద్దు

by Shamantha N |
Delhi high court: పూజా ఖేడ్కర్‌ను అప్పటి వరకు అరెస్టు చేయొద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్ప మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు అరెస్టు నుంచి రక్షణను పొడిగించింది. అధికార దుర్వినియోగం, తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 5 వరకు అరెస్టు చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. గత నెలలో యూపీఎస్సీ పూజా ఖేడ్కర్ పై చర్యలు తీసుకుంది. నకిలీ గుర్తింపు ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రయత్నించినందుకు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, దివ్యాంగుల హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

గతంలోనూ అరెస్టు నుంచి రక్షణ

జూలై 31న యూపీఎస్సీ పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్ లో జరిగే పరీక్షలు రాయకుండా ఆమెను డిబార్ చేసింది. ఇకపోతే, తన నియామకం, ఆమెను అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె వెల్లడించారు. తనపై చర్యను తీసుకునే అధికారం కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి) మాత్రమే తీసుకోగలదని పూజ ఖేడ్కర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇకపోతే, ఆగస్టు 21న ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీ వ్యతిరేకించినప్పటికీ ఢిల్లీ హైకోర్టు.. ఆగస్టు 29 వరకు ఆమెకు అరెస్టు నుంచి రక్షణను కల్పించింది.

Advertisement

Next Story

Most Viewed