- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Puerto Rico: ప్యూర్టో రికోలో కుప్పకూలిన పవర్ గ్రిడ్.. న్యూ ఇయర్ వేళ చీకట్లో ద్వీప దేశం
దిశ, నేషనల్ బ్యూరో: కరేబియన్ ద్వీపమైన ప్యూర్టో రికా(Puerto Rico)లో న్యూ ఇయర్ వేళ చీకట్లు అలుముకున్నాయి. భారీ పవర్ గ్రిడ్ (Power grid) కుప్పకూలడంతో దేశమంతా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.1.3 మిలియన్లకు పైగా జనాభా కరెంట్ లేకుండానే ఉన్నారు. సుమారు 90 శాతం మందికి విద్యుత్ లేకుండా పోయిందని స్థానిక కథనాలు వెల్లడించాయి. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి 48 గంటల సమయం పట్టొచ్చని కరెంట్ సరఫరా సంస్థ లూమా ఎనర్జీ తెలిపింది. పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ సమస్య ఎదురైందని వెల్లడించింది. అయితే గ్రిడ్ కుప్పకూలడానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, ప్యూర్టో రికో దేశ మౌలిక సదుపాయాలు నాసిరకం కావడంతో దీర్ఘకాలిక విద్యుత్తు అంతరాయాలతో నిరంతరం సతమతమవుతోంది. అలాగే 2017లో నాలుగో కేటగిరీ తుపాన్ అయిన మారియా హరికేన్‌తో తీవ్రంగా దెబ్బతింది.