Punjab Bandh: పంజాబ్ బంద్ ఎఫెక్ట్.. 200 రోడ్లు బ్లాక్.. 163 విమానాలు రద్దు

by Shamantha N |
Punjab Bandh: పంజాబ్ బంద్ ఎఫెక్ట్.. 200 రోడ్లు బ్లాక్.. 163 విమానాలు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: పంటలకు కనీస మద్దతు (MSP) ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు(Farmers) పంజాబ్ బంద్(Punjab Bandh) కొనసాగిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అన్నదాతల డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్‌ వ్యాప్తంగా కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (Kisan Mazdoor Morcha), సంయుక్త కిసాన్‌ మోర్చా (Samyukta Kisan Morcha) బంద్‌ చేపట్టింది. రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్‌లో పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూసివేశాయి. అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ గేట్‌, బటిండాలోని రాంపురా ఫుల్‌, మొహాలీలోని ఐఐఎస్‌ఈఆర్‌ చౌక్‌ వద్ద ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు, కురాలి రోడ్‌ టోల్‌ ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా- ఢిల్లీ హైవే, ఖరార్‌- మొరిండా హైవే సహా కీలక మార్గాలను రైతులు దిగ్బంధించారు.

రైలు సర్వీసులు రద్దు

పంజాబ్‌ అంతటా ప్రధాన రహదారులు, రైలు మార్గాలను రైతులు దిగ్బంధించారు. మొత్తంగా పంజాబ్ వ్యాప్తంగా దాదాపు 200కిపైగా రోడ్లను రైతులు బ్లాక్‌ చేశారు. మరోవైపు రైతుల బంద్‌ రైళ్ల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ- పంజాబ్‌ మధ్య రాకపోకలు సాగించే దాదాపు 163 రైల్వే సర్వీసులకు రద్దయ్యాయి. దీంతో రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా.. అత్యవసర సేవలను బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. రైతుల బంద్‌ దృష్ట్యా పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. మొహాలి జిల్లా అంతటా దాదాపు 600 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్‌ కొనసాగనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed