నదిలోకి దిగి తమిళనాడు రైతుల నిరసన (వీడియో)

by GSrikanth |
నదిలోకి దిగి తమిళనాడు రైతుల నిరసన (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక, తమిళనాడుకు కావేరి జల వివాదానికి పరిష్కారం దొరకడం లేదు. ఇరువైపుల రైతులు నీళ్లు విడుదల చేయాలని ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. నీటి విడుదల గొడవపై ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కాగా, ఇటీవల 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కావేరి బోర్డు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది.

దీనిపై తమిళనాడుకు నీరు విడుదల చేయొద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు నిరసనలు తెలిపారు. మరోవైపు తమిళనాడు సైతం రైతులు నిరసనలు చేస్తున్నారు. ఇవాళ కావేరి నీటి విడుదలపై తమిళనాడులోని తిరుచ్చిలో రైతులు కావేరి నది నీటిలో నిలబడి నిరసన చేపట్టారు. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story