- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక టూరిస్ట్ పొలిటిషియన్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. ప్రియాంక నాన్ సీరియస్, టూరిస్ట్ పొలిటిషియన్ అని అభివర్ణించారు. ఆమె ఎన్నికల తర్వాత కనుమరుగవుతారని, దేశాన్ని అర్థం చేసుకోలేరని తెలిపారు. భారత్ తో కనెక్టయ్యేలా కనిపించడం లేదన్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. టూరిస్టు రాజకీయ వేత్తలకు దేశంపై అవగాహన ఉండదని వెల్లడించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ-నెహ్రూ కుటుంబం పాత్రను తాను గౌరవిస్తానని, కానీ స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ప్రజల అభీష్టం కంటే ఒక వ్యక్తి వ్యక్తిగత ఆశయమే విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్‌కు స్వాతంత్య్రం రావాలన్న లక్ష్యం ముగిసిపోయిన తర్వాత, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని మహాత్మా గాంధీ సలహా ఇచ్చినప్పటికీ, చాలా మంది పోరాట యోధులు చేసిన కృషిని వారి వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఇష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్‌ను గాలికొదిలేయాలన్న మహాత్మా గాంధీ కోరికను ప్రస్తుతం గాంధీ కుటుంబం నెరవేరుస్తుందని ఎద్దేవా చేశారు. కాగా, గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.