- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ నిర్ణయంపై నేను సిగ్గుపడుతున్నా: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ గైర్హాజరు కావడంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ "దిగ్భ్రాంతి" వ్యక్తం చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు, మహిళలు పిల్లలను నిర్మూలించడాన్ని మౌనంగా చూడడం.. భారత్ నిలబడిన ప్రతిదానికీ విరుద్ధంగా ఉందని అన్నారు. గాజాలో కాల్పుల విరమణ కోసం మన దేశం ఓటింగ్‌కు దూరంగా ఉన్నందుకు నేను ఆశ్చర్యపోయాను.. సిగ్గుపడుతున్నాను.. అని అన్నారు.
‘కంటికి కన్ను అంటే మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది’ అని మహాత్మా గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. మరోవైపు ఇవాళ మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మధ్యప్రదేశ్ భారీ మార్పులకు సిద్ధమైందని, 225 నెలల పాలనలో 250 కుంభకోణాలు చేసిన అవినీతి బీజేపీ ప్రభుత్వం వదిలేస్తోందని, కాంగ్రెస్ భారీ మెజారిటీతో మధ్యప్రదేశ్‌లో గెలుస్తోందని తెలిపారు.
- Tags
- priyanka gandhi