Priyanka Gandhi Vadra : వయనాడ్ MP అభ్యర్థిగా ప్రియాంక గాంధీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-15 15:56:43.0  )
Priyanka Gandhi Vadra : వయనాడ్ MP అభ్యర్థిగా ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజీనామాతో కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బరిలోకి దిగబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం(AICC) మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండుచోట్ల పోటీ చేశారు. కేరళ(Kerala)లోని వయనాడ్, ఉత్తర్​ప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాయబరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు.

దీంతో వయనాడ్‌కు రాజీనామా చేశారు. తాజాగా.. వయనాడ్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) మంగళవారం విడుదల చేసింది. నవంబర్ 13న ఉప ఎన్నిక జరుగనుంది. వయనాడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నిక జరుగనుంది. వీటన్నింటికి అక్టోబర్ 18న నోటిఫికేషన్, నవంబర్ 13న ఉప ఎన్నిక, నవంబర్ 23న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా, తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed